20 లక్షల కుటుంబాలను ధనికులు దత్తత తీసుకోవాలి : చంద్రబాబు

రాష్ట్రంలో సంపన్నవర్గాల వారు పేదలకు సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం పీ4 విధానం ద్వారా ప్లాట్‌ఫామ్ నిర్మిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉగాది రోజున ప్రారంభించే జీరో పావర్టీ – పీ4 విధానంపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సాయం అందించేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చని, ఎవరినీ ఇందుకోసం ఒత్తిడి చేయొద్దని అధికారులకు సూచించారు. ఎన్నారైలు కూడా పీ4లో భాగస్వాములు కావొచ్చని.. గతంలో తన హయాంలో చేపట్టిన జన్మభూమి తరహాలోనే పీ4 కార్యక్రమానికి […]
ఎస్సీ వర్గీకరణతో ఎవరికి మేలు !

ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణ అనేది దశాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉంది. ఈ విషయం రాష్ట్రంలోని వివిధ ఎస్సీ సముదాయాల మధ్య సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం నడిచిన పోరాటంలో ముఖ్యమైన అంశం. 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ దీర్ఘకాల డిమాండ్‌కు కొత్త ఊపిరి పోసింది. చారిత్రక నేపథ్యం ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ డిమాండ్ 1994లో మదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS ) ఆధ్వర్యంలో ప్రారంభమైంది. మదిగ సమాజం, రాష్ట్రంలోని ఎస్సీలలో […]
రూ.37,702.15 కోట్ల రాజధాని పనులకు సీఆర్డీఏ ఆమోదం

దాదాపు రూ.37,702.15 కోట్ల విలువైన అమరావతి అభివృద్ది పనులకు సంబందించిన 59 టెండర్లకు సీఆర్డీఏ ఆమోదం తెల్పిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ నెల 17 న జరిగే క్యాబినెట్ సమావేశంలో వీటన్నింటినీ ఆమోదం పొంది వెంటనే పనులను ప్రారంభించండ జరుగుతుందన్నారు. వచ్చే మాసంలో దాదాపు 20 వేల మంది అమరావతి అభివృద్ది పనుల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి […]
నల్లమల అభయారణ్యంలో ఎలివేటెడ్ కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-శ్రీశైలం-నంద్యాల ప్రాంతాలకు ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్. ఈ మార్గంలో కొత్తగా ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి రానుంది. ఈ కారిడార్ పూర్తయితే.. తెలంగాణ-ఏపీ మధ్య ప్రయాణం 45 నిమిషాలు తగ్గుతుంది. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి..? ఎంత ఖర్చవుతుంది..? ఆసక్తికర విషయాలను తెలుసుకోండి.. తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-విజయవాడ హైవే తర్వాత ఎక్కువగా హైదరాబాద్-శ్రీశైలం హైవేపై రాకపోకలు సాగిస్తుంటారు. రాయలసీమ ప్రాంతానికి వెళ్లేవారితో పాటుగా.. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లేవారు ఈ హైవే పైనే వెళ్తుంటారు. […]
పోసాని కృష్ణమురళి అరెస్టు

నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. ఏపీ పోలీసులు హైదరాబాద్ లో ఆయనను అరెస్ట్ చేశారు. రాయచోటి పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై ఆరోపణలు ఉన్నాయి. ఏపీ వ్యాప్తంగా ఆయనపై కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీస్ స్టేషన్ లో పోసానిపై కేసు నమోదైంది. 352(2) 111 R/W (3)5 […]
కూటమిలో సుడిగుండాలు తప్పవేమో!

ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు. అలాటిది కూటమి ఒరలో మూడు కత్తులు –చంద్రబాబు; అయన కొడుకు లోకేష్; కూటమి కూర్పులో సూత్రధారి అయిన పవన్ కళ్యాణ్. ఇలా అయితే కలహాల కాపురం కాక మరేమవుద్ది. కూటమి విజయ పరంపర కు తానే కారణం అని పవన్ భావన. అది నిజం కూడా కావొచ్చేమో! బాబు మరోసారి అధికార పీఠం ఎక్కడానికి బీజేపీ తో సంధి కుదరడం కీలకంగా మారింది. అలాటి కూటమి రధచక్రానికి పవన్ ఇరుసు […]
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్

హైదరాబాద్ లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై ఇప్పటికే చాలా కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఏ క్షణమైనా వల్లభనేని వంశీని అరెస్టు చేస్తారని ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా… హైదరాబాదులో ఉన్న వల్లభనేని వంశీని అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. ఇవాళ ఉదయం అరెస్టు చేసిన తర్వాత విజయవాడకు వల్లభనేని వంశీని తరలిస్తున్నారు. అయితే ఏ కేసులో వల్లభనేని వంశీని అరెస్టు […]
చంద్రబాబు, నితీశ్ ను ‘ఫిక్స్’ చేసిన మోదీ- నెక్స్ట్ టార్గెట్..!!

ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. మూడో సారి గెలిచినా భాగ స్వామ్య పక్షాల మద్దతు మోదీకి అవసరమైంది. వరుసగా హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ లో గెలుపు తరువాత మోదీ లెక్కలు మారుతున్నాయి. ఇండియా కూటమి పైన గురి పెట్టారు. కాంగ్రెస్ కూటమి మిత్రులను మోసం చేస్తోందని కొత్త పల్లవి అందుకున్నారు. ఇదే సమయంలో తమ పైనే మోదీ ప్రభుత్వం మనుగడ ఆధార పడి ఉందని భావిస్తున్న మిత్రపక్షాలను ప్రధాని ఫిక్స్ చేసారు. […]
మీరు ఏ రకం సంపన్నులు ..?

ఈ భూమి మీద 12 రకాల సంపన్నులు ఉంటారు. మనం సాధారణంగా డబ్బు ఉన్నవాళ్ళనే సంపన్నులు అనుకుంటాం. నిజానికి డబ్బు ఉన్నవాళ్ళు కూడా సంపన్నులే కానీ చివరి రకం సంపన్నులు వాళ్ళు. ర్యాంకుల వారిగా ఆ 12 రకాల సంపన్నులని చూద్దాం 1. పాజిటివ్ మానసిక దృక్పథం కలిగి ఉన్నవాళ్ళు. ఈ భూమి మీద పాజిటివ్ మానసిక దృక్పథం కలిగిన వాళ్ళు అత్యంత సంపన్నులు. 2. మంచి శారీరక ఆరోగ్యం కలిగిన వాళ్ళు. ఎక్కువ మంది పట్టించుకోరు […]
కళ్లు చెదిరిపోయేలా ఏపీలో కోడి పందేలు

సంక్రాంతి అంటే కోడి పందేలే అన్నట్లు ఏపీలో పరిస్థితి మారిపోయింది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో కోడి పందేలను ఎమ్మెల్యేలే పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు కోడి పందేల ఫీవర్ పాకిపోయింది. అయితే పెద్ద కోడి పందేలకు మాత్రం పశ్చిమ గోదావరి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. పెద్ద పందేలు అంటే లక్షలు.. కొన్నిచోట్ల కోట్లలో కూడా పందేలు జరుగుతున్నాయి. అంటే రెండు, మూడు నిమిషాలు జరిగే పందెంపై కోటి కూడా పెడుతున్నారు. ఇందుకోసం […]